దత్తా దత్తా అనుకొందాం

శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దేవీ భజనఈ భజన పాఠం...ఇక్కడ ఉన్నది.



పల్లవి :
దత్తా దత్తా అనుకొందాం
ఆనందంతో యెగిరేద్దాం

చరణం :
వెనుకటి ఊసులు విసిరేద్దాం
ముందటి ఊహలు మానేద్దాం
తప్పూ వొప్పూ తగలేద్దాం
పుణ్యం పాపం ముంచేద్దాం ....1
ఆకలి దప్పులు మరిచేద్దాం
ఆశలు అన్నీ విడిచేద్దాం
తన పర భేదం తగదందాం
ముల్లోకాలే ఇల్లందాం ....2
వీణావేణువు వాయిద్దాం
సన్నాయ్ నొక్కులు నొక్కేద్దాం
డప్పులు డమరులు మ్రోగిద్దాం
తధిగిణ తకధోం సాగిద్దాం ....3
దత్తుని ముందర నిలబడదాం
ఆనందాశ్రువు లొలికేద్దాం
దత్తుని నవ్వులు జుర్రేద్దాం
నవ్వుల నాట్యం చేసేద్దాం ....4
దత్తుని పాదం పట్టేద్దాం
సంసారపు తుద ముట్టేద్దాం
దత్తుని కౌగిట గుచ్చేద్దాం
తన్మయ భావం పొందేద్దాం ....5
పల్లవి :
దత్తా దత్తా అనుకొందాం
ఆనందంతో యెగిరేద్దాం
దత్తుని కంటికి కనుపిద్దాం
కరుణారసమున తడిసొద్దాం
దత్తుని ఉపదేశం పొందుదాం
తత్త్వార్థమ్మున నెలకొందాం ....6
దత్తుని అభయం చేకొందాం
అందరి కభయం మనమిద్దాం
దత్తుం డెవరని చర్చిద్దాం
సచ్చిదానందుం డని యందాం ....7


Datta Datta Anukondam Bhajan by Sri Ganapathy Sachchidananda Swamiji from Hanuman HOFFMAN on Vimeo.